నేడు తెలంగాణలో ప్రధాని పర్యటన

Prime Minister Modis visit to Telangana
X

Prime Minister Modi’s visit to Telangana

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వీడ్ పెంచారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు. సభ అనంతరం సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించున్నారు. అనంతరం సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట నుంచి భవనేశ్వర్ కు పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నగరానికి వస్తున్న నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

Tags

Next Story