తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

Rains in Telangana for two more days
X

Rains in Telangana for two more days

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ మహానగరంలో మొన్న కురిసిన వర్షానికే జలమయం అయింది. అటు మంగళవారం కురిసిన భారీ వర్షానికి రైతులు నష్టపోయారు. ధాన్యం అంత తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు మండిన నగర ప్రజలకు వర్షం రాకతో వేడి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది.

Tags

Next Story