బాసర గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా, బాసర వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఆలయ పురవీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బాసరలో గతంలో జరిగిన వరద బీభత్సాన్ని ప్రజలు మరిచిపోకముందే మళ్లీ గోదావరి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండగా అంతకు తగ్గట్టుగానే దిగువకు విడుదల […]
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా, బాసర వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఆలయ పురవీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బాసరలో గతంలో జరిగిన వరద బీభత్సాన్ని ప్రజలు మరిచిపోకముందే మళ్లీ గోదావరి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండగా అంతకు తగ్గట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో బాసర ఆలయ ప్రాంతం గోదావరి బ్యాక్ వాటర్‌తో మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రవాహ ఉద్ధృతి కారణంగా బాసరలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బాసర ఆలయం వద్ద రహదారి నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలయంలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలకు హాజరవుతున్న భక్తులు గోదావరిలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించడానికి సాధ్యపడకపోవడంతో వెనుదిరుగుతున్నారు. గోదావరి ఘాట్ వద్ద లక్షలు వెచ్చించి టెండర్లు చేజిక్కించుకున్న వ్యాపారులు సైతం లబోదిబోమంటున్నారు. తమకు లేక పుణ్యస్నానాలు ఆచరించాడానికి రవాణా, ఆలయానికి రవాణా సౌకర్యం ఏర్పాట్లు చేయాలని ఫ్రీ బస్ సౌకర్యం స్టేషన్ రహదారి గుండా ఆలయం నుంచి గోదావరి నది వద్దకు రాకపోకలకు అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
-
Home
-
Menu