ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

X
Road Accident On Mumbai-Pune Expressway
మహారాష్ట్ర భోర్ ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన రెండు భారీ ట్రక్కులు ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై బోర్‌ఘాట్ సమీపంలో అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖోపోలిలోని ఆసుపత్రికి తరలించారు. ముంబై పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కోళ్లతో వెళ్తున్న రెండు వాహనాలు, కారు, టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
Next Story
-
Home
-
Menu