తిరుచానూరు అమ్మవారి సేవలో సమంత (వీడియో)

Samantha visited Sri Padmavathi Ammavari in Tiruchanur
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు సోమవారం ఉదయం తిరుచానూరులో కనిపించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. చిత్ర పరిశ్రమలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సమంత రూత్ ప్రభుని నయనతార అభినందించారు.
సమంత తిరుచానూరు ఆలయాన్ని సందర్శించిన వీడియోను అభిమానులతో ఎక్స్ లో పంచుకున్నారు. వీడియోలో, సమంతా షేడ్ కుర్తా-పైజామా సెట్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. సాధారణ బంగారు చెవిపోగులు, నుదుటిపై బొట్టుతో, జుట్టును వెనక్కి లాగి, సమంత చూడ ముచ్చటగా ఉంది. గుడిలో తనను చూసిన కొంతమంది అభిమానులతో సమంత సెల్ఫీలు కూడా దిగారు. ఆమెతో పాటు ఆమె స్టైలిస్ట్, స్నేహితుడు ప్రీతం జుకల్కర్ కూడా ఉన్నారు.
Actress #SamanthaRuthPrabhu visited Sri Padmavati Ammavaari Temple in Tiruchanur this morning.@Samanthaprabhu2 pic.twitter.com/UoMJKahUDk
— Suresh PRO (@SureshPRO_) March 4, 2024
-
Home
-
Menu