రోహిత్, విరాట్ కాదు... ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతడికే

Shami winner player of tourney
X

Shami winner player of tourney

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భారత్ విజయఢంకా మోగిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, రాహుల్ రాణిస్తుండడంతో టీమిండియాకు విజయాలు వరిస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. హార్థిక్ పాండ్యా గాయంతో వెనుదిరగడంతో షమీ లేట్ జట్టులోకి వచ్చిన లేటెస్ట్ గా బుల్లెట్ దిగిందా? లేదా? అనే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. జస్ట్ ఆరు మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. సెమీఫైనల్‌లో ఏడు వికెట్లు తీసి విజయంలో షమీ కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్‌లో మూడు సార్లు ఐదు వికెట్ల తీసిన అద్భుత పదర్శనలు చేశాడు.

ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్, రోహిత్‌ను కాదని షమీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలుస్తాడని భారత మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. హార్థిక్ పాండ్యా లేని లోటు ఎక్కడా కనిపించలేదని, భారత్‌కు రిజర్వ్ బెంచ్ ఎంత బలంగా ఉందో షమీ ద్వారా తెలిసిందన్నారు. షమీ అందరి అంచనాలను తలకిందులుగా చేయడంతో పాటు గొప్ప ప్రదర్శన చేపట్టాడని కొనియాడారు. ఆసియా కప్‌కు ముందు భారత టీమ్‌తో పోలిస్తే ఇప్పుడు భారత జట్టు బలంగా కనిపిస్తుందని యువి కొనియాడారు. గాయాల నుంచి కోలుకొని వచ్చిన బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారని యువి మెచ్చుకున్నారు.

Tags

Next Story