ఇండియాఎదే టెస్టు సిరీస్

ఇండియాఎదే టెస్టు సిరీస్
X

లక్నో: ఆస్ట్రేలియాఎ టీమ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య ఇండియా టీమ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇండియా ఎ జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 10తో సొంతం చేసుకుంది. 413 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇండియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ అజేయ శతకంతో జట్టును గెలిపించాడు. గురువారం మూడో రోజు ఆటలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రాహుల్ చివరి రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్ 210 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 176 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా శతకం సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సుదర్శన్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేశాడు. కెప్టెన్ ధ్రువ్ జురెల్ 56 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేయగా ఇండియా 194 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను 185 పరుగులకే పరిమితం చేశారు. ఇక క్లిష్టమైన లక్ష్యాన్ని ఇండియా టీమ్ అలవోకగా ఛేదించి సిరీస్‌ను దక్కించుకుంది.

Tags

Next Story