బాధగా ఉంది.. ఒక్క సిరీస్‌లో విఫలమైతే జట్టులో నుంచి తీసేస్తారా?: కరుణ్

బాధగా ఉంది.. ఒక్క సిరీస్‌లో విఫలమైతే జట్టులో నుంచి తీసేస్తారా?: కరుణ్
X
వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్ నుంచి ఉద్వాసనకు గురి కావడంపై భారత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ స్పందించాడు. ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన

ముంబై: వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్ నుంచి ఉద్వాసనకు గురి కావడంపై భారత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ స్పందించాడు. ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన ఏకంగా జట్టు నుంచి తొలగించడం బాధకు గురి చేసిందన్నాడు. ఇతర ఆటగాళ్లకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన జట్టు యాజమాన్యం తన విషయంలో ఇలా వ్యవహరించడం బాధగా ఉందన్నాడు. తనకు మరి కొన్ని అవకాశాలు ఇస్తే బాగుండేదన్నాడు. కొంత మంది వరుస వైఫల్యాలు చవిచూసినా సెలెక్టర్లు క్రమం తప్పకుండా అవకాశాలు కల్పించారని, తన విషయంలో మాత్రం పక్షపాతంగా వ్యవహరించారని వాపోయాడు.

Tags

Next Story