విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలి: బిర్లా

Students need sports and studies
X

Students need sports and studies

మన తెలంగాణ / మోటకొండూరు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి అండర్ 14 & 17 బాలురు, బాలికల ఖో - ఖో టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు […]

మన తెలంగాణ / మోటకొండూరు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి అండర్ 14 & 17 బాలురు, బాలికల ఖో - ఖో టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలని, క్రీడాకారులకు మా ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని అన్నారు.

Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?

మా బీర్ల ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సత్యనారాయణ, ఎంఇఒ రఘురాం రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్ గౌడ్, ఎంపిడిఒ ఇందిర, తాసిల్దార్ నాగ దివ్య, ఎస్సై అశోక్, మోటకొండూరు కాంగ్రెస్ పార్టీ మండ అధ్యక్షులు గంగాపురం మల్లేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరుని రఘునాథ రాజు, మహిళ అధ్యక్షురాలు బోయిని ఝాన్సీ, ఫిజికల్ డైరెక్టర్ లు, పిఇటి లు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story