బాసర ఆలయానికి ప్రత్యేక అధికారిగా బైంసా సబ్ కలెక్టర్

Basara Temple
X

Basara Temple

నిర్మల్: జిల్లాలోని బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి (Basara Temple) గత రెండేళ్లుగా రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ పరిశుభ్రత, నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయ వ్యవస్థను బలోపేతం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భైంసా సబ్ కలెక్టర్‌ సంకేత్ కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సబ్ కలెక్టర్ దేవస్థానం యాజమాన్యంతో సమన్వయం చేస్తూ ఆలయ పరిశుభ్రత, […]

నిర్మల్: జిల్లాలోని బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి (Basara Temple) గత రెండేళ్లుగా రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ పరిశుభ్రత, నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయ వ్యవస్థను బలోపేతం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భైంసా సబ్ కలెక్టర్‌ సంకేత్ కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

సబ్ కలెక్టర్ దేవస్థానం యాజమాన్యంతో సమన్వయం చేస్తూ ఆలయ పరిశుభ్రత, భద్రత, ప్రజా సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్య పండుగలు, భక్తుల రద్దీ సందర్భాలలో జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా సమన్వయంతో పనిచేస్తూ ఆలయ పరిపాలనలో అభివృద్ధి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.

Also Read : చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

Tags

Next Story