నాగారం బంగ్లా వద్ద కారు బీభత్సం.. నలుగురికి గాయాలు

X
సూర్యాపేట: నాగారం బంగ్లా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను కారు ఢీకొట్టింది. అతి వేగంగా వెళ్తూ.. కానిస్టేబుల్‌ను, మరో బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సహా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నాట్లు తెలుస్తోంది. సూర్యాపేట-జనగామ హైవేపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
Next Story
-
Home
-
Menu
