ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా?

ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడా?
X

సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట 47వ వార్డులో బ్యాలెట్ బాక్స్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓ లెటర్ వేశారు. అందులో రిటైర్‌మెంట్ తర్వాత తమకు రావాల్సిన డబ్బు ఇంకా అందలేదని ఉంది. రిటైర్‌ అయి 15 నెలలు గడుస్తున్నా.. డబ్బు అందలేదని లెటర్‌లో సదరు వ్యక్తి పేర్కొన్నారు. డబ్బులేక.. మెరుగైన వైద్యం చేయించుకోలేక.. ఇప్పటికే 62 మంది చనిపోయారని.. బాధతో తాము చనిపోక ముందే తమకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.

Tags

Next Story