హాస్టల్‌లో యువకుడి అనుమానస్పద మృతి

Miyapur Hostel
X

Miyapur Hostel

హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ హాస్టల్‌లో (Miyapur Hostel) దారుణం చోటు చేసుకుంది. ప్లంబర్‌గా పని చేస్తూ హాస్టల్‌లో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ అనే యువకుడు హాస్టల్‌‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్‌లో విగతజీవిగా పడి ఉండటంతో హాస్టల్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి హాస్టల్ వద్ద వచ్చిన మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళణ విరమించారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు […]

హైదరాబాద్: మియాపూర్‌లోని ఓ హాస్టల్‌లో (Miyapur Hostel) దారుణం చోటు చేసుకుంది. ప్లంబర్‌గా పని చేస్తూ హాస్టల్‌లో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ అనే యువకుడు హాస్టల్‌‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్‌లో విగతజీవిగా పడి ఉండటంతో హాస్టల్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి హాస్టల్ వద్ద వచ్చిన మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళణ విరమించారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం గణేష్ మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read : పీక కోయడంతో… వీధుల్లో పరుగులు తీసిన యువతి

Tags

Next Story