రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని మృతి

X
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు మనోజ్ఞను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ఞ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన పై పోలసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ఞ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story
-
Home
-
Menu
