నదిలో ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు

X
భద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు అదృష్టం కొద్దీ ఒడ్డుకు చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం బోట్లపై వెళ్లి గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
