కారును బైక్ ఢీకొని వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు

X
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సూరారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సాయి బాబా నగర్ రోడ్డులో అతివేగంతో వచ్చిన కారును బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
