ప్రేమ పెళ్లి ఇష్టం లేక.. కోడలిని నరికి చంపేశాడు..

ప్రేమ పెళ్లి ఇష్టం లేక.. కోడలిని నరికి చంపేశాడు..
X

ఆసిఫాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణీని మామ నరికి చంపేశాడు. దహేగాం మండలం గెర్రె గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు ప్రేమ వివాహం ఇష్టం లేకనే సత్తయ్య (మామ) ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పుట్టింట్లో ఉన్న రాణి (మృతురాలు)ని సత్తయ్య హతమార్చాడు. గతేడాది రాణిని శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story