హనుమకొండలో పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి

హనుమకొండలో పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
X

ఎల్కతుర్తి: పెళ్ల బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టడం ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా 12 మంది గాయపడడంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెంది యువతిని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి వివాహం జరిపించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు బృందం వరుడు ఇంటికి వెళ్తోంది. గోపాల్‌పుర్ వద్ద బొలేరో వాహనం ఆపి స్వేద తీరారు. బోర్ వెల్స్ వేగంగా వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. సూదన్ పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వరుడు, వధువు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story