కర్రగుట్టలో ఐఈడీల మోత..11మంది భధ్రాతా సిబ్బందికి గాయాలు

కర్రగుట్టలో ఐఈడీల మోత..11మంది భధ్రాతా సిబ్బందికి గాయాలు
X

దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్బంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీ పేలుళ్ళు కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్-తెలంగాణ సరిహద్దు సమీపంలోని కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్లకు పాల్పడటంతో.. 11మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పదిమంది ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడ్డారు. ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్‌పిఎఫ్ ఎలైట్ కోబ్రా యూనిట్ సిబ్బందితో కూడిన ఉమ్మడి యాంటీ-నక్సల్ ఆపరేషన్ బృందం లక్ష్యంగా సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్ ద్వారా రాయఫూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్ల డించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీజాపూర్‌లోని కర్రెగుట్ట కొండతోసహా 13 ప్రదేశాలలో సోమవారం

ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతకాన్ని పోలీసు భద్రాతా సిబ్బంది ఎగురవేశారు. కర్రెగుట్ట కొండను నక్సలైట్ల నుండి విముక్తి చేయడానికి, 22,000 మంది సైనికులు 21 రోజులపాటు యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రారంభించి 36మంది నక్సలైట్లను హతమార్చి అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తడ్పల క్యాంప్ వద్ద 196 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ 204వ బెటాలియన్ కోబ్రా సైనికులు మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. కర్రెగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో 11మంది సైనికులు గాయపడ్డినప్పటికీ, సైనికులు ధైర్యంగా ఉండి నక్సలైట్ కోటపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు. బీజాపూర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11మంది జవాన్లు తీవ్రంగా గాయపడగా, మరో పది మంది భద్రతా సిబ్బంది గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారని, పేలుడులో గాయపడిన వారు ప్రాణహాని నుంచి బయటపడ్డారని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి శర్మ తెలిపారు. ఐఈడి పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Tags

Next Story