నెల్లూరులో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో.. 11 ఏళ్ల బాలుడు మృతి

X
అమరావతి: నెల్లూరు జిల్లా రాముడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై ఉన్న 11 ఏళ్ల బాలుడిని ఆర్టిసి బస్సు ఢీకొనడంతో చక్రం కిందపడి బాలుడు మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం రాముడు పాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు సైకిల్ తొక్కుతున్నాడు. అన్న సైకిల్ వెనుక కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు అన్న మరణించగా, సైకిల్ తొక్కుతున్నతమ్ముడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కిరణ్ (11), తమ్ముడు( ప్రదీప్) గా పోలీసులు గుర్తించారు.
Next Story
-
Home
-
Menu
