12 మంది విద్యార్థులకు అస్వస్థత

12 మంది విద్యార్థులకు అస్వస్థత
X

ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని ఎస్‌టి ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులు ఉదయం ఉప్మా తిని పాఠశాలకు బయల్దేరారు. ప్రార్థన సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. గమనించిన పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి,

వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చామని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో ఉదయం ఉప్మా చేయగా విద్యార్థులు టిఫిన్ చేయకపోవడంతోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, పురుగుల అన్నం, ఉప్మాలో కూడా పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. జడ్‌పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్‌ఛార్జి సరిత అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు, వార్డెన్‌కు సూచించారు.

Tags

Next Story