వస్త్ర పరిశ్రమలో మంటలు.. 16 మంది మృతి, పలువురికి గాయాలు

వస్త్ర పరిశ్రమలో మంటలు.. 16 మంది మృతి, పలువురికి గాయాలు
X

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వస్త్ర పరిశ్రమ ఉన్న నాలుగంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేశారు. ఢాకాలోని రూప్ నగర్ ప్రాంతంలో కర్మాగారానికి ఆనుకోని ఉన్న ఒక రసాయనిక గిడ్డంకిలో మొదలైన మంటలు క్రమంగా వస్త్ర పరిశ్రమనూ ముట్టడించడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే అగ్నిమాపక సిబ్బంది ‘‘ వస్త్ర కర్మాగారంలో మంటల్ని ఆర్పేసినా, పక్కనే ఉన్న రసాయనిక గిడ్డంకిలో ఇంకా అగ్ని జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి’’ అని తెలిపారు.

Tags

Next Story