జగద్గిరిగుట్టలో బిర్యాని తిని ఒకరు మృతి.... 16 మందికి అస్వస్థత

17 people ill after eating biryani in Jagadgirigutta
X

17 people ill after eating biryani in Jagadgirigutta

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో రాత్రి 17 మంది కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మద్యం తాగి అనంతరం బిర్యాని తినిన 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న 15 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story