17 ఏళ్ల బాలికపై పార్కులో గ్యాంగ్ రేప్

17 ఏళ్ల బాలికపై పార్కులో గ్యాంగ్ రేప్
X

దేశ రాజధానిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులమంటూ నమ్మించి 17 ఏ ళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం సమీపంలోని ఓ పార్కులో సోమవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో 17 ఏళ్ల బాలిక, తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి కల్కాజీ ఆలయానికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆల య సమీపంలోని పార్కుకు వెళ్లారు. అక్కడ 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గు రు వ్యక్తులు వారిని అడ్డుకుని తాము పోలీసులమని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ త ర్వాత వారిద్దరినీ బెదిరించి, బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుల్లో ఒకరు తుపాకీ, కత్తితో బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసు లు తెలిపారు.

అనంతరం మరో ఇద్దరు కూడా ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉ న్నాయి. కల్కాజీ ఆలయం, ఇస్కాన్ ఆలయాన్ని కలిపే ప్రాంతంలోని పార్కులో అత్యాచారం జరిగినట్లు రాత్రి 8.45 గంటల కు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అం దింది. దీంతో పోలీసు బృందం అక్కడికి చే రుకుంది. ఢిల్లీకి చెందిన బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అమర్ కాలనీలోని డీఎం ఆఫీస్ రోడ్ సమీపంలో ఓ నిందితుడి కదలికలపై పోలీసులకు సమాచారం అందింది.పోలీసులు అడ్డుకున్న సమయంలో నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి కుడి కాలికి గాయమైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని అసిఫ్‌గా గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు హేమంత్, ముకేశ్‌ను కూడా మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Next Story