1800 నాటు కోళ్లు మృతి

1800  నాటు కోళ్లు మృతి
X

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన సోండ్ల చంద్రు మేర కు చెందిన 1800 వందల నాటు కోళ్లు మృతి చెందాయి. గత రెండు నెలల క్రితం సిద్దిపేట నుంచి 2 వేల నాటు కోళ్లు తీసుకువచ్చి తన ఫామ్‌లో పెంచుతున్నాడు. కాగా సోమవారం నుంచి మంగళవారం వరకు 1800 వందల కోళ్లు చనిపోయాయి. దీంతో బాధితుడు మాట్లాడుతూ కోళ్ల మృతి సుమారు 12 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. ఈ విషయంపై వెటర్నరీ డాక్టర్ శ్వేతను వివరణ కోరగా లంగ్స్ రెస్పిరేటరీ సమస్యతో కోళ్లు చనిపోయాయని తెలిపారు.

Tags

Next Story