బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
X


మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో విషాదం

మన తెలంగాణ/కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, ఎంచగూడెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఇటికాల నర్సయ్య=స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత=శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి దసరా పండుగకు వచ్చారు. కుటుంబ సభ్యులందరూ వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. దీంతో వీరిద్దరూ ఇంటి వద్దనే ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్ద బహిర్భూమికి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు, బట్టలు ఉండటంతో గ్రామస్థులు బావిలో వెతకడంతో ఇటికాల రితిన్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తగూడ ఎస్‌ఐ రాజ్‌కుమార్ స్వయం రంగంలోకి దిగి గ్రామస్థుల సాయంతో మరో బాలుడు జతిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story