కొండగట్టు మూల మలుపులో ఘోర ప్రమాదం

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: కొండగ ట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురు గా ఢీకొన్న ప్రమాదంలో సుమారు 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మల్యాల మం డలం కొండగట్టు స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్ర మాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారి కి చికిత్స అందిస్తున్నారు.
జగిత్యాల నుంచి క రీంనగర్ వైపు వెళ్తున్న లారీ, కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కరీంనగర్- 1 డి పోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు వేగంగా ఉండటం తో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోం ది. ఢీకొన్న ధాటికి బస్సు, లారీ ముందు భాగా లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయం లో బస్సులో ఉన్న సుమారు 25 మంది ప్రయాణీకులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
ప్రమాద విషయం తెలియగానే జిల్లా అదనపు క లెక్టర్ రాజగౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్ జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మె రుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారుల కు సూచించారు. వైద్యులు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొద్దిసేపు ఈ మా ర్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పో లీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు. మ ల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్ర మాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
మూలమలుపు వద్ద తరచూ ప్రమాదాలు
కొండగట్టు స్టేజీ సమీపంలోని మూలమలుపు వ ద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థా నికులు చెప్తున్నారు. మలుపు వద్దకు చేరుకునే వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొంటున్నారు. శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
-
Home
-
Menu
