21మంది మావోయిస్టుల లొంగుబాటు

21మంది మావోయిస్టుల లొంగుబాటు
X

మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్, అలియాస్ దేవ్ మజ్జి, ఆయన భార్య సహా పది మంది మావోయిస్టులు సోమవారం నాడు చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల తలలపై మొత్తం రూ.2.95 కోట్ల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఎకె 47 రైఫిల్ సహా మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అప్పగించారు. రాంధెర్‌కు హొరుపు, అమర్జీత్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవ్ మజ్జి ఎంఎంసి జోన్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆయన తలపైనే రూ.1.05 కోట్ల రివార్డు ఉంది. ఆయన భార్య అనిత, అలియాస్ లత డివిజినల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, మరో నలుగురు సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్లు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో 10మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. వీరి లొంగుబాటుతో దిండోరి, మాండ్లా ప్రాంతాలు పూర్తిగా మావోయిస్టు రహితం అయ్యాయని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ.2.36కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

Tags

Next Story