మధ్యాహ్న భోజనం తిని.. 21 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

X
సంగారెడ్డి: మునిపల్లి మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 21 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఉపాధ్యాయులు 108కు సమాచారం ఇవ్వడంతో రాయికోడ్ 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేష్‌కు సీరియస్‌గా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్కూల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
