విషాహారం తిని 25 గొర్రెలు మృతి

eating poisoned food
X

eating poisoned food

పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, పెరకపల్లి గ్రామంలో శుక్రవారం విషాహారం తిని 25 గొర్రెలు మృతి చెందాయి. ఇరు మల్లయ్యకు చెందిన 8, మట్టే తిరుపతికి చెందిన 6, అచ్చే రాజయ్యకు చెందిన 6, అచ్చే చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓరెం చిరంజీవి, పార్టీ సోషల్ మీడియా వారియర్ బుట్టి సాగర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అచ్చే తిరుపతి వెంటనే ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో. బాధితులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వారికి తానున్నానంటూ భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి సమాచారం తీసుకెళ్లిన మంత్రి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.

వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి పూర్తి నివేదిక అందించాల్సిందిగా జిల్లా పశు వైద్యశాఖ అధికారి విజయభాస్కర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యశాఖ అధికారి విజయభాస్కర్, మండల పశువైద్యాధికారి అజయ్ పెరకపల్లి గ్రామానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించడంతోపాటు బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందిస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ మండల నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని సమాచారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మణ్‌కుమార్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి జిల్లా అధికార బృందాన్ని పంపించి తమకు న్యాయం చేసేందుకు కృషి చేయడం పట్ల బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story