పెళ్లి కాలేదన్న నిరాశ ..25 ఏళ్ల యువకుడి బలవన్మరణం

సమాజం ఏమనుకుంటుందనే క్షోభ, పెళ్లి కాలేదన్న నిరాశ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండల పరిధిలోని మాసన్‌పల్లి గ్రామానికి చెందిన దొడ్ల పండరి(25) హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఎన్ని సంబంధాలు చూసిన కుదరకపోవడంతో పండరి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇప్పటికి పెళ్లి కాలేదా? అంటూ చుట్టూ ఉన్నవారు చేసే విమర్శలు, ఎగతాళి మాటలను తట్టుకోలేకపోయాడు. ఈ అభద్రతాభావంతో కుంగిపోయిన పండరి గురువారం ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు బాన్సువాడు, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశాడు. ఎస్‌ఐ రవిగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో వాస్తవాలు
నేడు చదువులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా 30 , 35 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సర్వసాధారమైంది. పెళ్లి ఆలస్యం కావడం ఎవరి వ్యక్తిగత లోపం కాదని, సామాజిక పరిస్థితుల ప్రభావమని యువత గ్రహించాలి. సమాజం మాటలు శాశ్వతం కావు. ఇతరుల విమర్శల కోసం కన్నవారికి క్షొభ మిగుల్చుతూ ప్రాణాలు తీసుకోవడం పిరికితనం. ఏ సమస్యకైన ప్రాణమే పరిష్కారం కాదనే స్పృమ ప్రతి ఒక్కరిలోను ఉండాలి. ఆత్మవిశ్వాసంతో బతకడమే ఆసలైన విజయం.
-
Home
-
Menu
