ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, గోగొండ ప్రాంతానికి చెందిన 29 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం సుక్మా జిల్లాలోని గోగొండ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి చెందిన 29 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ 74వ బెటాలియన్ సిబ్బంది, కోబ్రా 201 బెటాలియన్ సిబ్బంది జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్వహిస్తున్న పూనామార్గం ప్రచారంతోపాటు, గోగొండ అటవీ ప్రాంతంలో కొత్త భద్రతా శిబిరం ఏర్పాటు చేసిన నాటినుండి భద్రతా దళాల ఒత్తిడి కారణంగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, అటవీ ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు కల్పిస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు,

లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులైన అనేకమంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు.దానిలో బుధవారం 29 మంది మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. గోగొండ అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులకు సురక్షితమైన స్వర్గధామంగా ఉండేదని, దండకారణ్యమైన అడవులు, కొండలు ఉండడంతో మావోయిస్టులకు పెట్టెని కోటగా మారాయని. కానీ భద్రతా దళాల వ్యూహాలతో గోగొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, దీనితో అనేకమంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని లొంగిపోతున్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న సహాయ పునరావాస విధానం ద్వారా 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు అందజేస్తున్నట్లు తెలిపారు.అలాగే ఇంకా లొంగిపోవాలనుకునే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవనం సాగించడానికి పోలీసుల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏ.ఎస్.పి రోహిత్ షా, సిఆర్పిఎఫ్ 74వ బెటాలియన్ కమాండెంట్ హిమాన్స్ పాండే, డీఎస్పీ మనీష్ రాత్రే పాల్గొన్నారు.

Tags

Next Story