చర్లపల్లిలో విషాదం.. రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

చర్లపల్లిలో విషాదం.. రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
X

హైదరాబాద్: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన చర్లపల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, పి.విజయ, పి.చేతన రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story