రిమ్స్ ఘటనలో ముగ్గురు శిశువులు మృతి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. అయిదు రోజుల శిశువు మృతి చెందింది. వార్డులో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. అందులోని పిల్లలను సిబ్బంది పక్క వార్డుకు తరలించారు. గాయాలైన పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మరో ఇద్దరు శిశువులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. బాధిత కుంటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తాం: మంత్రి దామోదర
రిమ్స్‌లో ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహ అన్నారు. మంగళవారం రిమ్స్‌లో ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ రాజర్షిషా, రిమ్స్ అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందడం బాధాకరమని అన్నారు.
రిమ్స్‌లో ఎలక్ట్రికల్,ఫైర్,సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చాంగ్తూ, డిఎంఎ వాణి, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్,ఐటిడిఎ పివొ మంద మకరంద్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు,మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌రాథోడ్, డిఎంహెచ్‌వొ సాధన, వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
Home
-
Menu
