మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

X
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ వద్ద 765D జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న తరుణంలో నర్సాపూర్ నుంచి బైక్ పై మెదక్ వైపు వెళ్తున్న వారిని మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (51) తో పాటు కొడుకు రిశివర్ధన్ గౌడ్ (13), అల్లుడు బొగడ సాయ గౌడ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు కొల్చారం పోలీసులు ఘటన స్టలికి చేరికొని మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
