పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్‌ తో పాటు 30 మంది మావోలు లొంగుబాటు

పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్‌ తో పాటు 30 మంది మావోలు లొంగుబాటు
X

అమరావతి: మావోయిస్టు పార్టీ పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్‌ సోది కేశాలు అలియాస్‌ మల్లా లొంగిపోయారు. కేశాలుతో పాటు 30 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఏకే-47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. త్వరలో మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియస్ ఆశన్న అలియాస్ రూపేష్ ఉద్య సహచరులు 208 మందితో పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీకి చెందిన 130 మంది సభ్యులు డిజిపి శివధర్ ఎదుట లొంగిపోయిన విషయం విధితమే.


Tags

Next Story