భైంసాలో 30 మందిపై కుక్క దాడి

X
నిర్మల్ జిల్లా, భైంసా పట్టణంలో సోమవారం ఒక కుక్క ఏకంగా 30 మందిపై దాడి చేసి కరిచింది. పట్టణంలోని భట్టిగల్లి, ఖడ్డా హోటల్, బస్టాండ్, మదీనా కాలనీ, తదితర ప్రాంతాల్లో కుక్క దాడి చేసి కరవడంతో బాధితులు భైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులకు అవసరమైన మందులను అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, మున్సిపల్, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి మదీనా కాలనీలో 30 మందిపై దాడి చేసి కరిచిన కుక్కను గుర్తించి చంపేశారు.
Next Story
-
Home
-
Menu
