రోడ్డు ప్రమాదంలో 3వేల బాతులు మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో 3వేల బాతులు మృత్యువాత
X

మండల పరిధిలోని ముష్టిబండ - మొద్దులగూడెం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో సుమారు 3,000 బాతులు మృత్యు వాత పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడువాయి గ్రామం నుండి తిరువూరుకు నాలుగు వేల బాతులతో వెళ్తున్న బొలెరో వాహనం, ముష్టిబండ సమీపంలోని ధాబా వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంది. అదే సమయంలో మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బొలెరోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో బొలెరోలో తరలిస్తున్న 4,000 బాతులలో సుమారు 3,000 బాతులు అక్కడికక్కడే మరణించాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులుహెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డు పక్కన పడిపోయిన బొలెరో వాహనాన్ని, లారీని బయటకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

Tags

Next Story