ఐపిఎల్ వేలం బరిలో 350 మంది క్రికెటర్లు!

X
ముంబై: అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మినీ వేలం పాటలో 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఐపిఎల్ వేలం పాట కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి బిసిసిఐ ఏకంగా 1005 మంది క్రికెటర్ల పేర్లను తొలగించింది. అబుదాబిలో జరిగే వేలం పాటలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక ఐపిఎల్ మినీ వేలం అబుదాబిలో జరుగుతుందని బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు మెయిళ్లను పంపించింది మొదట బిడ్డిం ప్రక్రియ, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా వేలం పాట కొనసాగనుంది. తొలుత క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమయ్యే ఆక్షన్ తర్వాత అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలంతో ముగుస్తోంది.
Next Story
-
Home
-
Menu
