మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 7 గ్రామాలు దూరం..

Mandatory to produce EPIC at polling stations for voter
X

Mandatory to produce EPIC at polling stations for voter 

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రజలు తమ సొంతూర్లకు చేరుకుంటున్నారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 7 గ్రామాలు దూరంగా ఉన్నాయి. అమ్రాబాద్‌ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్‌ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్‌ కేటాయించారు. ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఏడు గ్రామాలు ఎన్నికలు జరగడం లేదు.

కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మూడో దశ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యా హ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాల లో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

Tags

Next Story