దుండిగల్ లో 425 కిలోల గంజాయి పట్టివేత

101 kg cannabis seized in Bhadrachalam
X

101 kg cannabis seized in Bhadrachalam

ఆరుగురు అరెస్ట్

దుండిగల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల భారీగా ఆపరేషన్ చేపట్టారు. ఒరిస్సా నుండి సోలాపూర్ కు డిసీఎం లో భారీగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పై నిఘా ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ జోన్ పోలీసులు 425 కేజీల గంజాయి తో పాటు ఆరుగురు గల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను దుండగల్ పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Tags

Next Story