అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న ఐదుగురు చిన్నారులకు అస్వస్థత..ఆలస్యంగా వెలుగులోకి

X
కిష్టారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీలో అందించిన ఆకు కూర పప్పులో గన్నేరు ఆకులు కలవడంతో అదే ఆహారాన్ని చిన్నారులకు పెట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పిల్లలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. చిన్నారులకు మూడు రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని,
ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఖమ్మం నుంచి వరంగల్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
