ఫుడ్‌పాయిజన్ తో 57 మంది విద్యార్థులకు అస్వస్థత

57 students fall ill with food poisoning
జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం, ధర్మవరం ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే శనివారం ఉదయం ఎర్రవల్లి మండలంలోని ఎస్‌సి బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుంది. ఉదయం అల్పాహారం కింద జీరా రైస్ ఇవ్వగా శీను, అఖిల్, భరత్ అనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కోలుకుంటున్న విద్యార్థులు
శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సంతోష్, ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాస్పిటల్‌కి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టల్లో మొత్తం 140 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు రాత్రి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదటిసారి కలిపి వండడంతో ఆహారం పడని 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌లు పంపించి విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని అన్నారు. 32 మంది విద్యార్థులం ఆరోగ్యం కుదుటపడడంతో శనివారం ఉదయం వారిని డిశ్చార్జ్ చేశారని అన్నారు. మిగతా 22 మంది ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.
హాస్టల్ వార్డెన్ సస్పెండ్
ధర్మవరం హాస్టల్‌లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యుడిని చేస్తూ వార్డెన్ జయరాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు.
-
Home
-
Menu
