ప్లే స్కూల్ బోనాల ఉత్సవాల్లో విషాదం..

ప్లే స్కూల్ బోనాల ఉత్సవాల్లో విషాదం..
X

సంగారెడ్డి: జిల్లాలోని తెల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్ళిన ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి తన కుమారుడు షణ్ముక్ ను ప్రతిరోజు లాగే గురువారం ఉదయం శ్రీకర్ వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో దింపి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఈ ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాల సెలబ్రేషన్స్ జరుగుతుండగా.. బయటకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో స్కూల్ పక్కనే ఉన్న చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పోస్ట్ మార్టం కోసం బాలుడి మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story