తిరుమల దర్శనానికి 6 గంటల సమయం.. భక్తుల రద్దీ కొనసాగింపు!

X
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని మొత్తం 81,516 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Tags
Next Story
-
Home
-
Menu
