పాలిటెక్నిక్ హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

పాలిటెక్నిక్ హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
X

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి వారు చికెన్‌తో భోజనం చేశారు. గురువారం ఉదయం 5 గంటలకు పలువురికి జ్వరంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. కొందరిని ఇంటికి పంపించినట్లు తెలిసింది. ఘటనపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు.

Tags

Next Story