రామగుండం సిపి ఎదుట 8మంది మావోల లొంగుబాటు

రామగుండం సిపి ఎదుట 8మంది మావోల లొంగుబాటు
X

రామగుండం సిపి అంబర్ కిషోర్ ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8మంది మిలీషియా, కొరియర్, సాంసృ్కతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు లొంగిపోయారు. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహాకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను తెలుసుకుని, తాము కూడా కుటుంబీకులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో వెల్గటూర్ మండలం చెగ్యాంకు చెందిన ధర్మాజీ శ్రీకాంత్ (మావోయిస్టు కొరియర్), పొడియం కాములు (మిలీషియా కమాండర్), ముడియం జోగ (సాంసృ్కతిక ప్రచార కార్యకర్త), కుంజం లక్కె (పార్టీ సభ్యురాలు), మోదం భీమ (మిలీషియా సభ్యుడు), కుంజం ఉంగా (జిఎడి కమాండర్), ముడికం సుక్రం (మిలీషియా సభ్యుడు), ముడియం మంగు (మిలీషియా సభ్యుడు) ఉన్నారు. వీరిలో శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణవాసి. మిగిలిన వాళ్లంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గాంగేలురు పోలీస్ స్టేషన్ పరిధి గంపుర్ గ్రామానికి చెందినవారు.


ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి: సిపి

ఆయుధాలు, అజ్ఞాతం వీడి... జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు సీపీ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివద్ధికి తోడ్పడాలన్నారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేట్ పోలీసు శాఖ ఎల్లప్పుడూ కషి చేస్తుందన్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్ పూర్తిగా తగ్గిందని, చదువరులెవరూ మావోయిస్టు పార్టీవైపు ఆర్షితులు కావడం లేదన్నారు. అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్, కరీంనగర్ జిల్లా మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఎఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్‌లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్‌ఐ శేఖర్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story