పాఠశాల విద్యార్థిని కాటేసిన పాము.. చికిత్స పొందుతూ మృతి

X
నారాయణపేట: నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎక్లాస్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రంజిత్ (8) గురువారం తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Tags
Next Story
-
Home
-
Menu
