పత్తి చేనులో 9 అడుగుల కొండచిలువ

పత్తి చేనులో 9 అడుగుల కొండచిలువ
X

మనతెలంగాణ/నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రైతు పెద్ది కృష్ణారెడ్డికి చెందిన పత్తి చేనులో బుధవారం 9 అడుగుల కొండచిలువ కనిపించింది. రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్లబెల్లికి చెందిన పిట్టల రమేష్ చాకచక్యంగా కొండచిలువను బంధించి స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్‌ఐ సాయి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Tags

Next Story