చత్తీస్‌గఢ్‌లో 9మంది మావోల లొంగుబాటు

చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ జిల్లా కేంద్రంలో 9మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాయపూర్ రేంజ్ ఐజి ఉమరేష్ కుమార్ మిశ్రా, జిల్లా ఎస్పీ ఎదుట దామ్ తరిలో నగరి ఏరియా కమిటీ, సీతానది ఏరియా కమిటీ, గరియా బంద్, సువాపాడ డివిజన్‌కు చెందిన 9మంది మావోయిస్టులు ఎల్‌జిఎస్ ఆయుధాలతో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరంతా జిల్లాలో జరిగిన అనేక ప్రధాన సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులపై 47 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు తెలిపారు. చత్తీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం, రాయపూర్ జిల్లా పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు అందజేస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్టు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవితం గడపాలనే మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోవచ్చని సూచించారు.
-
Home
-
Menu
